Students Union ABVP Called For Bandh Today

Students-Union-ABVP-Called-For-Bandh-Today
abvp called for bandh today,abvp bandh today

ABVP STUDENTS UNION CALLED FOR BANDH TODAY:

*రాష్ట్రంలో ఇప్పుడున్న ప్రభుత్వంతో అసంతృప్తి చెందుతున్న రైతుల ఆత్మహత్యలు ఒకవైపు, నిరుద్యోగ యువత ఆత్మహత్య లు  మరొక వైపు*
*1944 వ సంవత్సర కాలంలో అప్పుడు ఉన్న ప్రభుత్వం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను సంఘసంస్కర్తలు అయినటువంటి వారి చేతుల మీదుగా నడుస్తున్న ట్రస్టు లకు లీజుకు భూములను ఇచ్చి నేటి aided విద్యా వ్యవస్థ ను ప్రారంభించారు*
*Aided విద్యా వ్యవస్థ వల్ల ప్రతి ఏటా కొన్ని లక్షల మంది విద్యార్థులు తక్కువ ఫీజులతో నే ప్రభుత్వ సహకారంతో వారి విద్యను అభ్యసిస్తున్నారు*
*జీవో నెంబర్ 35 వల్ల aided విద్యా సంస్థలకు స్టాఫ్ రిక్రూట్మెంట్ ని నిలిపి వేయడం తో, పేద,బడుగు,బలహీన వర్గాల  విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించలేకపోవడం aided విద్యావ్యవస్థలో మొదలైంది*
*1944వ  సంవత్సరంలో లిటరసీ రేట్ తక్కువగా ఉండటం వల్ల ఎంతోమంది మహానీయులు ఒక నిర్ణయానికి వచ్చి aided విద్యావ్యవస్థను ప్రారంభిస్తే, ఈ కేసీఆర్ ప్రభుత్వం ప్రతియేటా కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉపయోగపడే aided కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుంది*
*50 మంది IAS లను బదిలీ చేసినా కూడా ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ ను మాత్రం బదిలీ చేయకపోవడానికి కారణం ఏమిటి?  ఈ కుట్రలో కొన్ని వేల కోట్లు దోచుకోవాలని ప్రభుత్వం  నవీన్ మిట్టల్ తో చేతులు కలిపారు*
*అయ్యా కేసీఆర్ మిమ్మల్ని వేడుకునేది ఒకటే విషయం మీరు ఇచ్చే గొర్లు,బర్లు,పెన్షన్లు పేదోడి కడుపు నింపుతాయి ఏమో కానీ దేశ భవిష్యత్తు కి ఉపయోగపడవు, ఒక విద్యార్థి దేశ చరిత్రను మార్చగలగుతా డు. కానీ మీరు ఆ విద్యావ్యవస్థను పూర్తిగా  బ్రష్టు పట్టిస్తున్నారు.*
*మీరు హామీ ఇచ్చిన, మీ టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో లో ఉన్న  కేజీ నుండి పిజి వరకు ఉచిత విద్యను అందిస్తామన్నారు కానీ మీ ప్రభుత్వం ఉన్న AIDED వ్యవస్థను కూడా ప్రైవేటీకరణ చేస్తుంది*
*మీరు ఇచ్చిన హామీని* *నెరవేర్చేందుకు ఒక సలహా,*
*కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించేందుకు* *ఎయిడెడ్ కళాశాల లను మీరు ఉపయోగించుకోవచ్చు.* *ఏవీ కాలేజ్, వి వి కాలేజ్, రెడ్డి ఉమెన్స్ కాలేజ్, సూర్య లక్ష్మీ డిగ్రీ కాలేజ్, భవన్స్ న్యూ సైన్స్ కాలేజ్, ధర్మ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ సైన్స్ అండ్ కామర్స్, అంబేద్కర్ కాలేజ్, కస్తూర్బా డిగ్రీ కాలేజ్ లాంటి 68 aided కళాశాలలను మీరు ఉపయోగించుకోవచ్చు*
*ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి విద్యా వ్యవస్థను కాపాడాలి.*
*డిమాండ్స్…*
*1. Aided కళాశాలల భూములను కబ్జా దారుల నుండి కాపాడాలి*
*2. GO 35  రద్దు చెయ్యాలి.*
*3. దోస్త్ డిగ్రీ అడ్మిషన్ ప్రక్రియ లో ప్రైవేట్ aided నీ తొలగించి Aided నీ కొనసాగించాలి.*
*4. Aided కళాశాలలో టీచింగ్ నొన్ టీచింగ్ పోస్ట్ లను బర్తి చెయ్యాలి.*
*5. Aided కళాశాలలో అధ్యాపకులను ప్రభుత్వ కళాశాలలకు బదిలీ నీ ఆపాలి.*
#SUPPORTABVP
Spread the love

Leave a Comment

error: Content is protected !!